అమరావతి : భోగాపురం (Bhogapuram) అంతర్జాతీయ విమానాశ్రయం పనులు 2026 నాటికి పూర్తయి ప్రారంభానికి చర్యలు తీసుకుంటామని ఏపీ సీఎం చంద్రబాబు (AP CM Chandrababu) పేర్కొన్నారు. ఈ విమానాశ్రయం వల్ల భోగాపురం ఎకనామిక్ హబ్ (Economic hub ) గా తయారవుతుందని వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా చంద్రబాబు అనకాపల్లి, విశాఖపట్నం జిల్లాలో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన విమానాశ్రయం పనులను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖపట్నానికి మెట్రో కూడా రావాల్సి ఉందని, విమానాశ్రయాన్ని మెట్రోతో అనుసంధానం చేయాలని అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్రకు గ్రోత్ ఇంజిన్(Growth Engine) అవుతుందని పేర్కొన్నారు. విమానాశ్రయం ప్రారంభించి ఉత్తరాంధ్ర రుణం తీర్చుకుంటానని వెల్లడించారు. వైసీపీ (YCP) ప్రభుత్వం ఉత్తరాంధ్రను మొత్తం చిన్నాభిన్నం చేసిందని ఆరోపించారు.
అరాచకాలు చేసిన వ్యక్తిని ప్రజా కోర్టులో శిక్షించారని , వైసీపీ పాలనలో రాష్ట్రం మొత్తం దివాలా తీసిందని, డబ్బుల్లేని పరిస్థితిని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. అనకాపల్లి జిల్లా దార్లపూడిలో పోలవరం ఎడమ కాలువను చంద్రబాబు పరిశీలించారు. రైతులతో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేస్తే జిల్లా అభివృద్ధి చెందుతుందని, రైతులకు న్యాయం చేయడం ఎన్డీయే బాధ్యతని తెలిపారు.
Jagan resignation | జగన్ రాజీనామాపై వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే ?