అమరావతి : పుట్టపర్తి శ్రీసత్యసాయిబాబా( Sri Sathya Sai Baba) సేవామార్గానికి ప్రతిరూపంగా నిలిచారని భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ (Vice President Radhakrishanan) అన్నారు. పేద ప్రజలకు నిస్వార్ధ సేవలు అందించారని, మానవసేవే మాధవసేవ అని నమ్మి ఆచరించారని పేర్కొన్నారు.
శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పుట్టపర్తిలోని ( Puttaparthy) హిల్వ్యూ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. తన ప్రమేను ప్రపంచమంతా పంచి లక్షలమందిని సేవామార్గంలో నడిపించి మహనీయుడని ప్రశంసిం చారు. సత్యసాయి ట్రస్ట్ ద్వారా లక్షలమందికి తాగునీరు అందించారని ,తమిళనాడులో తాగునీటి సదుపాయం కల్పించి ప్రజల దాహార్తి తీర్చారని తెలిపారు.
ఎన్నో వైద్యాలయాలు స్థాపించి పేదలకు వైద్యమందించారని వెల్లడించారు. దేశ, విదేశాల్లో సత్యసాయిబాబా సిద్ధాంతాలు అమలవుతున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సత్యసాయి పుణ్యభూమి పుట్టపర్తిలో ఒక లక్ష్యం కోసం అవతరించారని తెలిపారు. సత్యసాయిబాబా క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేశారని వెల్లడించారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ ఇంద్రసేనా రెడ్డి, తదితరులు మాట్లాడారు.