అమరావతి : కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు లంచం తీసుకున్న బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ లల్లిని ఏబీసీ అధికారులు రెడ్ హ్యండెడ్గా పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో బీసీ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ పనిచేస్తున్న లల్లి ( Deputy Director Lalli ) బాధితుడి నుంచి రూ. 40 వేలు లంచం ( Bribe ) తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఆమెతో పాటు మధ్యవర్తిత్వం వహించిన అసిస్టెంట్ సూర్యశివ ప్రసాద్, మాజీ ఉద్యోగి సత్యనారాయణను పట్టుకుని కేసు నమోదు చేశారు.
బీసీ సంక్షేమ శాఖలో అంబేద్కర్ అనే ఉద్యోగి ఉద్యోగం చేస్తూ చనిపోయారు. అయితే కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు, కాంపెన్సేటివ్ బెనిఫిట్స్ ఫైల్ క్లియర్ చేసేందుకు బాధితుల నుంచి లంచం డిమాండ్ చేశారు. దీంతో అంబేద్కర్ కుమారుడు చక్రవర్తి ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు బుధవారం రూ.40 వేల నగదు ఇస్తుండగా పట్టుకుని కేసు నమోదు చేశారు.