అమరావతి : భారత పార్లమెంట్ తొలి దళిత మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి (GMC Balayogi ) తనయుడు హరీశ్ మాథుర్ పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారు. అమలాపురం నుంచి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన హరీశ్ (Harish), వైసీపీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌ను 3,42,196 ఓట్లతో ఓడించారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ (TDP)అభ్యర్థిగా హరీశ్ పోటీ చేసి ఓడిపోయారు.
బాలయోగి 2002లో నియోజకవర్గంలో పర్యటిస్తుండగా కైకలూర్ వద్ద కొల్లెరు సరస్సులో హెలికాప్టర్ (Helicopter) కూలిపోయిన దుర్ఘటనలో మృతి చెందారు. ఆయన మృతి అనంతరం జరిగిన ఉప ఎన్నికలో బాలయోగి సతీమణి విజయకుమారి ఎంపీగా పోటీ చేసి ఎన్నికయ్యారు.