అమరావతి : అనంతపురం( Anantapur ) జిల్లాలో సంచలనం కలిగించిన బాలుడి హత్యకేసులో నిందితుడు పోలీసులపై ( Police ) ఎదురు దాడికి దిగాడు. దీంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ( Firing ) నిందితుడు గాయపడ్డాడు. జిల్లాలో యాడి మండలం ( Yadi Mandal ) కోన ఉప్పలపాడు సమీపంలోని కొండల్లో నిన్న ఏడేళ్ల బావమరిదిని బావ సర్వేశ్‌కుమార్( Sarvesh Kumar ) హత్య చేశాడు.
బాలుడు కనిపించడం లేదని బావ సర్వశ్కుమార్పై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయగా పోలీసులు అతడిని పట్టుకుని బాలుడి ఆచూకీ కనుగొన్నారు. బాలుడు కొండల్లో రాళ్ల మద్యన శవమై కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. కాగా సీన్ రికన్స్ట్రక్షన్ కోసం నిందితుడిని శుక్రవారం కొండ ప్రాంతానికి తీసుకెళ్లగా అక్కడ పడి ఉన్న ఖాళీ బీరు సీసాతో పోలీసులపైకి దాడి చేశాడు.
ఈ దాడిలో సీఐ రామసుబ్బయ్య, కానిస్టేబుల్ వెంకటేష్‌కు గాయలయ్యాయి. అయిన పోలీసులపై దాడి చేస్తుండడంతో పోలీసులు అతడి మోకాళ్లపై కాల్పులు జరుపడంతో నిందితుడు గాయపడ్డాడు. ముగ్గురిని పోలీసులు స్థానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ పోలీసులను అనంతపురం జిల్లా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాగా చికిత్సపొందుతున్న పోలీసులను జిల్లా ఎస్పీ జగదీష్ పరామర్శించారు.