హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): బ్రిటిష్ పార్లమెంట్లో లార్డ్ (ఎంపీ) హోదా తెలుగువారికి దక్కడం ఎంతో గర్వకారణమని నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల, బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల కొనియాడారు. ఇటీవల లార్డ్ హోదా దక్కించుకున్న ఉదయ్ నాగరాజును యూరప్ పర్యటనలో ఉన్న వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. ఉదయ్నాగరాజును స్వయంగా కలుసుకోవడం సంతోషాన్నిచ్చిందని గణేశ్బిగాల, మహేశ్ బిగాల పేర్కొన్నారు. వారి వెంట బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.
హామీల అమల్లో కాంగ్రెస్ విఫలం: మహేశ్
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎన్నారై బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల విమర్శించారు. లండన్‌కు చేరుకున్న ఆయనకు యూకే ఎన్నారై బీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ (సర్), రానున్న రోజుల్లో చేపట్టనున్న పార్టీ సభ్యత్వ నమోదు, ఎన్నారై శాఖల బలోపేతంపై అక్కడి కార్యకర్తలకు మహేశ్ బిగాల వివరించారు. కాంగ్రెస్ వైఫల్యాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే శాఖ అధ్యక్షుడు నవీన్‌రెడ్డి, ఉపాధ్యక్షులు హరిగౌడ్ నవాబుపేట, సత్యమూర్తి చిలుముల, సతీశ్‌రెడ్డి గొట్టిముక్కుల, మాజీ అధ్యక్షుడు అశోక్‌గౌడ్ దూసరి, జనరల్ సెక్రటరీ రత్నాకర్ కడుదుల, ఐటీ, మీడియా అండ్ పీఆర్ కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, కోశాధికారి సురేశ్ బుడగం తదితరులు పాల్గొన్నారు.