అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హాస్పిటల్లో ప్రసవించి బెడ్‌పై ఉన్న భార్యను భర్త దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం గుడెకల్ గ్రామానికి చెందిన రామయ్య భార్య నరసమ్మ శనివారం హాస్పిటల్లో ప్రసవించింది. ఈ విషయం తెలుసుకున్న భర్త ఆదివారం ఆసుపత్రికి వచ్చి ఆమెను పరామర్శించి వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెను పొడిచి పారిపోయాడు.
తీవ్రంగా గాయపడ్డ నరసమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి ఆసుపత్రిలో సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నారు. అయితే నరసమ్మ గత కొంతకాలంగా భర్తకు దూరంగా ఉంటుండంతో ఆమెపై కక్ష పెంచుకుని దారుణానికి ఒడిగట్టి ఉండవచ్చిని పోలీసులు భావిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.