అమరావతి : మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డిపై(Minister Buggana Rajendranath Reddy) ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు(Atrocity case) నమోదయింది. నిన్న ఏపీలో జరిగిన ఎన్నికల్లో(Elections) పలు చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. అందులో భాగంగా డోన్ నియోజకవర్గ స్వంతంత్ర అభ్యర్థి పీఎస్ బాబు కారుపై మంత్రి బుగ్గన అనుచరులు దాడి చేశారు. బుగ్గన తనను కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని బాధితుడు బాబు బేతంచెర్ల పోలీస్ స్టేషన్లో (Bethamcherla Police Station) ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు బుగ్గన సహా అతడి అనుచరులపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.