అమరావతి : ఏపీలోని కర్నూలు (Kurnool ) జిల్లాలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన 8వ తరగతి చదువుతున్న బాలికపై (Minor Girl) గ్రామ ప్రథమ పౌరుడు సర్పంచ్‌తో ( Sarpanch) పాటు మరో ఇద్దరు అత్యాచారానికి ఒడిగట్టారు. జిల్లాలోని కోసిగి మండలం కడదొడ్డిలో ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు అత్యాచార యత్నం చేశారు.
బాలిక, ఆమె తాత కేకలు వేయడంతో ఆ ముగ్గురు అక్కడి నుంచి పారిపోయారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు సర్పంచ్, మరో ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు ఆందోలన నిర్వహించారు.