అమరావతి : 2022-2023 వార్షిక బడ్జెట్‌కు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా సభ్యులు అనుమతి తెలిపారు. దీంతో సభ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినట్లు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం రూ. 2.56 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని తెలిపారు.ఇది ప్రజా బడ్జెట్అని అన్నారు. గత మూడేళ్లుగా ప్రభుత్వ ఆచరణే మాట్లాడుతుందన్నారు.
మూడేళ్లలో 95 శాతం హామీలు నెరవేర్చామని పేర్కొన్నారు. కరోనా వచ్చి ఆదాయం తగ్గినా ప్రభుత్వ దీక్ష మారలేదని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో కులమత ప్రాంతాలు , రాజకీయాలు చూడలేదని పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ నుంచి 2023 మార్చి నెలవరకు నెలవారీగా సంక్షేమ కార్యక్రమాల అమలును ప్రకటించారు. వసతి దివెన, విద్యాదీవెన, రైతన్ననేస్తం తదితర నెలవారీ పథకాల అమలును వివరించారు. చంద్రబాబు తన ఐదేళ్లకాలంలో చెప్పుకోడానికి ఒక్క మంచిపని చేయలేదని విమర్శించారు.