Rowdy Sheeter Srikanth | నెల్లూరు రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోలు ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. పెరోలు మీద వచ్చిన అతను ఆస్పత్రిలో ఓ మహిళతో రొమాన్స్ చేసిన వీడియో వైరల్ కావడం దుమారం రేపింది. అతనికి వైసీపీ నేతలు పెరోలు ఇప్పించారని టీడీపీ వాళ్లు అంటుంటే.. టీడీపీ వాళ్లే ఇప్పించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దీనిపై సీరియస్ అయిన ఏపీ ప్రభుత్వం శ్రీకాంత్ పెరోలును రద్దు చేసింది. అలాగే వివరణ ఇవ్వాలని హోం శాఖను కూడా ఆదేశించింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ నిడిగుంట ఫేస్బుక్లో ఎమోషనల్ పోస్టు పెట్టారు.
శ్రీకాంత్‌ను వాడుకున్న వాళ్లందరూ ఎందుకు నోరు మెదపడం లేదు.. అంటే శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీకు ఇష్టమని మేం అంచనా వేసుకోవాలా అని ప్రశ్నించింది. అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి.. ఓపెన్ అయిపోతే మేలు కదా అని నిలదీశారు. ఇప్పటికైనా స్పందిస్తారా.. శ్రీకాంత్ మాట కూడా లెక్కచేయకుండా నోరు విప్పాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహా అయితే మీరు చంపేస్తారు అంతే కదా.. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలుపడి బతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు శ్రీకాంత్‌తో ఆస్పత్రిలో రాసలీలల వీడియో లీకేజీపైనా అరుణ స్పందించారు. ‘నాకు ఆస్తులు బాగా ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. నేను తెల్ల రేషన్ కార్డు ఉన్న మహిళను. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో నాకు ఎలాంటి పరిచయాలు లేవు.. నేను లాబీయింగ్ చేయించే పరిస్థితిలో లేనని పేర్కొన్నారు. మీడియాలో వచ్చిన వార్తల వల్లే పెరోలు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లీగల్ పెరోలు అయితే .. ఆర్డర్ ఇచ్చిన అధికారుల పేర్లను బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
‘నా భర్త చనిపోయాడు. నా భర్త, శ్రీకాంత్ ఇద్దరి వాయిస్ ఒకేలా ఉండటంతో తనకు ప్రపోజ్ చేశా.’ అని తెలిపారు. ప్రేమించడం తప్పా అని అరుణ ప్రశ్నించారు. మేం ఇద్దరం కలిసి బతకాలని నిర్ణయించుకున్నామని.. ఆ వీడియోలో ఏం తప్పుందని మండిపడ్డారు. దువ్వాడ శ్రీనివాస్ – మాధురి జంటను ఎవరూ తప్పుపట్టడం లేదని.. నన్ను ఎందుకు ట్రోల్ చేస్తున్నారని నిలదీశారు. ఏ ఆడపిల్ల ఒక ప్రిజనర్ను పెళ్లి చేసుకోలేదు.. నేను చేసుకున్నాననంటే నన్ను అర్థం చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. తాము పెళ్లి చేసుకుని నెల్లూరు వదిలి వెళ్లిపోవాలని అనుకుంటున్నామని చెప్పారు. నా ప్రేమను బతికించండని వేడుకున్నారు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేస్తున్నారని.. మా ప్రేమన అర్థం చేసుకోండి అని బతిమిలాడారు.