అమరావతి : స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి జరిగిందని ఆరోపిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిన విషయంలో ఏసీబీ కోర్టులో వాదనలు ముగిసాయి. దాదాపు 8 గంటలకు పైగా జరిగిన వాదనలు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసాయి. ఇరువాదనలు విన్న ఏసీబీ కోర్టు తీర్పు ( Reserve) ను రిజర్వ్ చేసింది. ఏ క్షణమైన తీర్పును వెల్లడించే అవకాశముండడంతో సర్వత్ర ఉత్కంఠ నెలకొని ఉంది.
ఆదివారం ఉదయం నుంచి సీబీఐ న్యాయవాదులు, ఇటు చంద్రబాబు (Chandra Babu) కు సంబంధించిన న్యాయవాదులు ఇరువురు తమ వాదనలు కొనసాగిస్తుండడంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో ఉత్కంఠ నెలకొని ఉంది. మధ్యాహ్న భోజన విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన వాదనల్లో ఇరువురు న్యాయవాదులు తమ పట్టును కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సీబీఐ న్యాయవాది (CBI Advocate) తన వాదనలు కొనసాగిస్తూ చంద్రబాబు అరెస్టు (Arrest) కు ముందు స్పీకర్ (Speaker ) కు సమాచారం అందించామని వెల్లడించారు.
చంద్రబాబు వాస్తవ హోదా ఎమ్మెల్యే మాత్రమే. అరెస్టు చేయడానికి గవర్నర్ అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. గవర్నర్‌కు మూడు నెలలలోపు సమాచారం ఇచ్చి రాటిఫై చేయొచ్చని వాదించారు. అరెస్టుకు ముందు స్పీకర్‌కు సమాచారం అందించామని స్పష్టం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ నిధులు ఎక్కడెక్కడకు మళ్లాయో తెలియాలంటే బాబును విచారించాలని రిమాండ్ విధించాలని కోరారు.
ప్రభుత్వ నిధులు వివిధ దశల్లో చేతులు మారిందని ఆరోపించారు. కాగా ఢిల్లీ నుంచి సుప్రీం కోర్టు న్యాయవాది లూథ్రా (Luthra ) వాదిస్తూ చంద్రబాబుపై ఆదారాలు లేని ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్టుకు గవర్నర్ అనుమతి తీసుకోలేదని అన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి సీఐడీ అధికారుల ఫోన్ సంభాషణలను కోర్టుకు సమర్పించాలని సూచించారు. రిమాండ్ రిపోర్ట్ తిరస్కరించాలని పంజాబ్ మణిందర్ సింగ్ కేసును లూథ్రా ప్రస్తావించారు.