తిరుమలలో అరణ్యకాండ పారాయణ దీక్షకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
Aranyakanda|లోక కల్యాణార్థం తిరుమల వసంత మండపంలో టీటీడీ నిర్వహించనున్న అరణ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ
తిరుమల : లోక కల్యాణార్థం తిరుమల వసంత మండపంలో టీటీడీ నిర్వహించనున్న అరణ్యకాండ పారాయణ దీక్ష కార్యక్రమానికి శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఇందులో భాగంగా సంకల్పం, విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రుత్విక్వరణం, కంకణ ధారణ, అగ్నిప్రతిష్ట, అంకురార్పణ నిర్వహించారు. ఈ సందర్బంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ కెఎస్ఎస్.అవధాని మాట్లాడుతూ శ్రీరాముడు పితృవాక్య పరిపాలన కోసం అరణ్యవాసం చేస్తూ రాక్షసులను సంహరించి, తపస్సు చేసుకునే ఋషులకు రక్షణ కల్పించాడని తెలిపారు. అరణ్యకాండలోని 75 సర్గల్లో 2,454 శ్లోకాలు ఉన్నాయన్నారు.
ఈ శ్లోకపారాయణ ద్వారా రాక్షస గుణాలు తొలగిపోయి సాత్విక గుణాలు అలవడతాయని అన్నారు. తిరుమలలోని వసంత మండపంలో ప్రతిరోజూ ఉదయం 8.30 గంటల నుంచి 16 మంది వేద, శాస్త్ర పండితులతో పారాయణదీక్ష చేపడతారని చెప్పారు.
మరో 16 మంది పండితులు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ధర్మగిరి శ్రీ వేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో జప, తర్పణ, హోమాదులు ప్రతి శ్లోకానికీ నిర్వహిస్తారని వివరించారు. కార్యక్రమంలో ఈవో ఎవి.ధర్మారెడ్డి, వేద పాఠశాల అధ్యాపకులు, వేద పండితులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

