అమరావతి : ఏపీలో ఎప్సెట్ ఫలితాలు ( Apset results ) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదిక ద్వారా బుధవారం ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవాప్తంగా పరీక్షలు రాసిన విద్యార్థుల్లో 70.52 శాతం మంది క్వాలిఫై అయ్యారని వెల్లడించారు.
ఇంజినీరింగ్ విభాగంలో 2,76,572 మంది పరీక్షలు రాయగా 1,82,317 మంది క్వాలిఫై అయినట్లు వివరించారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మా విభాగంలో 79,231 మంది దరఖాస్తు చేసుకోగా 70,929 మంది హాజరై , 63, 546 మంది క్వాలిఫై అయినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా క్వాలిఫై అయిన విద్యార్థులను మంత్రి అభినందించారు.