ఆధునిక సమాజంలో పురుషులతో సమానంగా మహిళలూ ఉద్యోగాలు చేస్తూ ఆర్థికంగా నిలదొకుకుంటున్నారు. అయితే, కేవలం డబ్బు సంపాదించడం మాత్రమే కాకుండా, సంపాదించిన సొమ్మును సరైన పద్దతిలో పొదుపు చేసి, పెట్టుబడిగా మార్చడం ద్వారానే నిజమైన ఆర్థిక స్వాతంత్య్రం సిద్ధిస్తుంది. ఉద్యోగం చేసే మహిళలు ఆర్థికంగా మరింత పటిష్ఠంగా మారడానికి అవలంబించాల్సిన సూత్రాలు ఇవి..
50-30-20 సూత్రం: నెలజీతాన్ని క్రమశిక్షణతో ఖర్చు చేయండి. ఇంటి అద్దె, నిత్యావసరాలు, కరెంట్ బిల్లులు, పిల్లల ఫీజులు వంటి తప్పనిసరి ఖర్చులకు జీతంలో 50 శాతం ఖర్చు పెట్టండి. సినిమాలు, షాపింగ్, విహారయాత్రలు, రెస్టారెంట్ల ఖర్చులకు 30 శాతం కేటాయించండి. అన్నింటికంటే ముఖ్యంగా జీతం రాగానే 20 శాతం భాగాన్ని పకన పెట్టిన తరువాతే మిగిలిన మొత్తాన్ని ఖర్చు చేయడం అలవాటు చేసుకోవాలి.
అత్యవసర నిధి: జీవితంలో ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో ఊహించలేం. ఉద్యోగ భద్రత లేకపోవడం, వైద్య ఖర్చులు వంటి అత్యవసర పరిస్థితులను ఎదుర్కునేందుకు 6 నెలల పాటు జీవించేందుకు సరిపడా డబ్బును లిక్విడ్ ఫండ్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లలో ప్రత్యేకంగా దాచుకోండి.
మ్యూచువల్ ఫండ్స్: కేవలం బ్యాంకు సేవింగ్స్ ఖాతాలోనే డబ్బులు ఉంచితే ద్రవ్యోల్బణాన్ని అధిగమించలేం. దీనికోసం క్రమబద్ధమైన పెట్టుబడి విధానమైన మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయండి. దీనిద్వారా దీర్ఘకాలంలో మంచి చక్రవడ్డీ లాభాలు పొందగలుగుతారు.
బంగారంపై పెట్టుబడి: సాధారణంగా మహిళలకు బంగారం అంటే ఇష్టం. అయితే ఆభరణాల రూపంలో కొంటే తరుగు వల్ల నష్టపోయే అవకాశం ఉంది. అందుకే సావరిన్ గోల్డ్ బాండ్స్, గోల్డ్ ఈటీఎఫ్స్‌లో పెట్టుబడి పెట్టడం సురక్షితం. వీటిపై కేంద్ర ప్రభుత్వం అదనపు వడ్డీని కూడా ఇస్తుంది.
ఇన్సూరెన్స్ పాలసీలు: అత్యవసర వైద్య ఖర్చుల వల్ల మీ పొదుపు కరిగిపోవొద్దంటే.. ఆరోగ్య బీమాతోపాటు తకువ ప్రీమియంతో ఎకువ కవరేజీ ఇచ్చే టర్మ్‌ప్లాన్ కూడా తీసుకోవడం ఉత్తమం. తమపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఆర్థిక భద్రత ఇచ్చేందుకు ఇవి దోహదం చేస్తాయి.