అమరావతి : ఏపీలో కొత్తగా కొలువుదీరిన చంద్రబాబు(Chandra Babu) ప్రభుత్వం ఐఏఎస్(IAS), ఐపీఎస్ (IPS) అధికారుల బదిలీలపై దృష్టిని సారించింది. ముఖ్యంగా జగన్ ప్రభుత్వానికి అంటకాగిన అధికారులను జీఏడీ(GAD) కి అటాచ్ చేసింది. మంత్రి వర్గం ప్రమాణం చేసిన వారం రోజుల తరువాత సమర్ధవంతమైన ఐఏఎస్ అధికారులను ముఖ్యమైన శాఖలకు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇందులో భాగంగా మొత్తం 19 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వీటితో పాటు ఏపీలో నీటి పారుదల రంగంపై ప్రత్యేక దృష్టిని సారించిన కూటమి ప్రభుత్వం జలవనరులశాఖకు సలహాదారుడి (Advisor) గా రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వరరావును(Venkateswara Rao) నియమించింది. ఈయన రెండేళ్లపాటు పదవిలో కొనసాగుతారని ఉత్తర్వులో వెల్లడించింది.