హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళల అదృశ్యానికి మహిళా వలంటీర్లే కారణమని ఏలూరులో సభలో అనుచిత వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై ఏపీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ మేరకు సోమవారం ఆయనకు నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పవన్‌పై కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఉరవకొండ ఠాణాలో ఫిర్యాదు చేశారు.