అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన నైరుతి ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఉంది. మరోవైపు కర్ణాటక నుంచి విదర్భ, ఛత్తీస్గఢ్ మీదుగా ఒడిశా వరకు అల్పపీడన ద్రోణి విస్తరించడంతో బంగాళాఖాతం నుంచి తూర్పుగాలులు వీస్తున్నాయి. కోస్తాలో ముఖ్యంగా గుంటూరు,కృష్ణా,విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి.
రానున్న 24 గంటల్లో కోస్తా ఆంధ్ర,రాయలసీమల్లో పలుచోట్ల అక్కడక్కడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం వరకు రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు వేరుశనగ, మిర్చి, వరి, మినుము, పెసర, కంది పంటలకు నష్టం వాటిల్లింది.