అమరావతి : రిపబ్లిక్‌డే వేడుకల (Republic Day Celebration) సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) నిర్వహించిన పరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన శకటానికి మూడో స్థానం దక్కింది. ఏపీ ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల (Etikoppaka Toys) శకటం పరేడ్‌ను తిలకించేందుకు వచ్చిన అతిథులు, ప్రజలకు ఎంతగానో ఆకట్టుకుంది.
పరేడ్‌లో అన్ని రాష్ట్రాలకు చెందిన శకటాల ప్రదర్శనతో పాటు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కాగా శకటాల ప్రదర్శనలో ఉ త్తరప్రదేశ్‌కు (Utterpradesh) మొదటి స్థానం, త్రిపురకు (Tripura) రెండో స్థానం దక్కిగా ఏపీకి మూడో స్థానం వచ్చినట్లు రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉత్తమ శకటంగా గిరిజన శాఖ శకటం ఎంపికైనట్లు పేర్కొంది. త్రివిధ దళాల్లో జమ్మూకశ్మీర్ రైఫిల్స్ కవాతు బృందం, కేంద్ర బలగాల విభాగంలో ఢిల్లీ పోలీసు కవాతు బృందం ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్‌గా ఎంపికయ్యాయి.