అమరావతి : ఏపీలో సంచలనం సృష్టించిన ముంబయి నటి జత్వానిపై (Actress Jatwani Case) జరిగిన వేధింపుల కేసును కూటమి ప్రభుత్వం సీరియస్‌గా దృష్టిని సారించింది. వైసీపీ పాలనలో నటి జత్వానిపై అక్రమ కేసు బనాయించి, ఆమె కుటుంబాన్ని బెదిరించి, నిర్భదించి లబ్ధిపొందిన వైసీపీకి చెందిన నాయకులు, సీనియర్ ఐపీఎస్‌లపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. అవసరమైతే ఆన్లైన్లో ఫిర్యాదు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఏసీపీ స్రవంతి రాయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసింది.
ఈ సందర్భంగా కేసు విచారణకు గానువాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేస్తామని విజయవాడ సీపీ (Vijayawada CP) రాజశేఖర్ బాబు ( Rajshekar Babu) వెల్లడించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కేసులో సీనియర్ ఐపీఎస్‌లపై ఆరోపణలు వచ్చిన నేపధ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు విచారణ చేపడుతామని వెల్లడించారు.
రాతపూర్వకంగా ఫిర్యాదు అందనప్పటికీ వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేపడుతామని వెల్లడించారు. విచారణకు ప్రత్యేక బృందం ఏర్పాటు చేస్తామన్నారు. ఐపీఎస్‌లపై వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు సేకరించాలని ఉత్తర్వులు జారీ చేశారు. నివేదిక త్వరగా ఇవ్వాలని ఏసీపీని ఆదేశించారు.