AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
AP News | ఏపీలోని 19 మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియన నిలిచిపోయింది. ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీచేసింది. దాంతో ఈ మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, అభ్యర్థుల తుదిజాబితా ప్రచురణ నిలిచిపోయాయి.
AP News : ఏపీలోని 19 మున్సిపాలిటీలలో ఎన్నికల ప్రక్రియన నిలిచిపోయింది. ఆయా మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కాసేపటి క్రితమే ఉత్తర్వులు జారీచేసింది. దాంతో ఈ మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ, అభ్యర్థుల తుదిజాబితా ప్రచురణ నిలిచిపోయాయి. అంతకుముందు రాష్ట్రంలో అధికార పక్షం వేధింపుల కారణంగా పలు ప్రాంతాల్లో తమ అభ్యర్థులు నామినేషన్లు వేయలేకపోయారని, వారిని అడ్డుకున్నారని ఆరోపిస్తూ వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
నామినేషన్ల దాఖలును అడ్డుకున్నారని, గడువు పొడిగించి తగిన రక్షణ కల్పించాలని వైసీపీ తన పిటిషన్లో కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం, ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు జరగడం రాజ్యాంగ మౌలిక సూత్రమని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో వైసీపీ చేసిన ఫిర్యాదులను, సమర్పించిన ఆధారాలను కేసుల వారీగా పరిశీలించి అక్టోబర్ 22వ తేదీలోగా నిర్ణయం తీసుకోవాలని ఎస్ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటివరకు అభ్యర్థుల తుదిజాబితాను ప్రచురించవద్దని స్పష్టంచేసింది. అక్టోబర్ 25న తుదిజాబితాను విడుదల చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని ఎస్ఈసీ తన ప్రకటనలో పేర్కొన్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని 8 మున్సిపాలిటీల్లో నిలిచిన ఎన్నికల ప్రక్రియ..!
Saurav Das | సౌరవ్ దాస్, రాంకాలకు అదనపు జుడీషియల్ కస్టడీ కోరిన పోలీసులు.. ఆర్డర్ రిజర్వ్ చేసిన కోర్ట్
DGP CV Anand | అమరుల త్యాగాలతోనే రాష్ట్రంలో శాంతిభద్రతలు.. నిజాయితీగా సేవ చేయడమే వారికి నిజమైన నివాళి: డీజీపీ సీవీ ఆనంద్
‘తమపై దాడి చేసిన కాంగ్రెస్ గుండాలపై చర్యలు తీసుకోవాలి’
IND vs PAK | దేశంలో అస్థిరతకు భారత భద్రతా సలహాదారే కారణం.. మళ్లీ నోరు పారేసుకున్న పాకిస్థాన్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?

