AP News | కృష్ణానదిలో మునిగిన నాటుపడవ.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం ప్రాతూరు వద్ద కృష్ణా నదిలో నాటుపడవ మునిగిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అర్జున్ (17), హర్ష (18)గా గుర్తించారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
AP News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. తాడేపల్లి మండలం ప్రాతూరు వద్ద కృష్ణా నదిలో నాటుపడవ మునిగిన ఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను అర్జున్ (17), హర్ష (18)గా గుర్తించారు. శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాతూరు గ్రామానికి చెందిన ఈశ్వర్, సందీప్, సంతోష్, అర్జున్, హర్ష అనే ఐదుగురు స్నేహితులు శనివారం సరదాగా నాటుపడవలో నదీపాయను దాటి వెళ్లారు.
తిరిగి వస్తున్న క్రమంలో వారు ప్రయాణిస్తున్న పడవలోకి నీరు చేరడంతో అది నదిలో మునిగిపోయింది. సందీప్, సంతోష్, ఈశ్వర్ ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరి ఈ ప్రమాదం నుంచి బయటపడ్డారు. అర్జున్, హర్ష నదిలో గల్లంతయ్యారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, గజ ఈతగాళ్లు గ్రామస్థుల సహకారంతో గాలింపు చర్యలు చేపట్టి, గల్లంతైన ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు.
మృతులలో ఒకరైన హర్ష తాడికొండలో ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. దసరా సెలవుల కోసం స్వగ్రామానికి వచ్చి ఇలా మృత్యువాత పడటం గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. హర్ష తల్లిదండ్రులు కొన్నేళ్ల క్రితమే మరణించినట్లు స్థానికులు తెలిపారు. అర్జున్ పదో తరగతి పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tamil Nadu | తమిళనాడులో భారీ వర్షాలు.. పలు పర్యాటక ప్రాంతాలు మూసివేత
AP News | కృష్ణానదిలో మునిగిన నాటుపడవ.. ఇద్దరు యువకులు దుర్మరణం..!
జడ్చర్ల మార్చురీలో మృతదేహాలు కుళ్లిపోవడం దారుణం : మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
Baththa | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. ఐదు భాషల్లో స్ట్రీమింగ్కు సిద్ధం!
Barack Obama | డొనాల్డ్ ట్రంప్‌ది మోసపూరిత పాలన.. అమెరికా అధ్యక్షుడిపై మాజీ అధ్యక్షుడి తీవ్ర విమర్శలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

