Anna Canteen | అన్న క్యాంటీన్ల ప్లేట్ల క్లీనింగ్‌పై సోషల్‌మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. తణుకు అన్న క్యాంటీన్ల ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లపై సైకో జగన్ విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
రుచి, శుచి, శుభ్రతకు అన్న క్యాంటీన్లలో అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. అసలు చేతులు కడుగు స్థలంలో వైసీపీ మూకలే అన్నం ప్లేట్లు వేసి వీడియో తీశారని.. దానితో ఫేక్ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఘటనపై తెలుగు దేశం పార్టీ కూడా ట్విట్టర్లో తీవ్రంగా మండిపడింది. పేదోడి అన్నంపై మీపై ఏడుపులు చూస్తుంటే.. అసలు మీరు మనుషులేనా అని అనిపిస్తుందని తెలిపింది.
స్పష్టంగా చేతులు కడుగు స్థలం అని రాసి ఉన్నప్పటికీ కావాలనే బురద జల్లడానికి చేతులు కడిగే సింకులో, అన్నం తిన్న ప్లేట్లు పడేసింది సైకో బ్యాచ్ అని టీడీపీ అని తెలిపింది. అదే సమయంలో చేతులు కడిగే సింకు బ్లాక్ అవ్వడంలో, సిబ్బంది వచ్చి ఆ ప్లేట్లు, చెత్త తీస్తున్న సమయంలో ఒక 40 సెకండ్ల వీడియో తీసి, సిగ్గులేని ప్రచారం చేస్తున్నారని జగన్‌రెడ్డిపై మండిపడింది. ప్రతి అన్న క్యాంటీన్లో ప్లేట్లు కడిగే స్థలం వేరే ఉంటుందని.. వేడి నీటిలో, సోప్ వాటర్‌లో పరిశుభ్రమైన ప్రాంతంలో శుభ్రం చేస్తారని తెలిపింది. జగన్ రెడ్డి నవ్వు, నీ సైకోలు ఎంత విష ప్రచారం చేసినా అన్న క్యాంటీన్లు ఆగవని స్పష్టం చేసింది. వచ్చే నెలలో మరో 70 క్యాంటీన్లను తమ ప్రభుత్వం ప్రారంభించబోతుందని తెలిపింది.
అన్నం పెడతామని అవమానిస్తారా…?
గతిలేక తినడానికి వస్తున్నారని అవహేళన చేస్తారా?పేదలకు రూ.5 కే భోజనం పెడుతున్నామని ప్రచారం చేసుకుంటూ, పచ్చ ప్రభుత్వం చేస్తున్న దగుల్బాజీ పని ఇది.
అపరిశుభ్రమైన నీళ్లలో ప్లేట్లు కడగడం, అడిగితే గతిలేక తినడానికి వస్తున్నారని కటువుగా మాట్లాడడం…… pic.twitter.com/0jjR6MrdaB
— YSR Congress Party (@YSRCParty) August 26, 2024
కాగా, తణుకు అన్న క్యాంటీన్లో పరిశుభ్రతపై వీడియో వైరల్ కావడంతో అధికారులు స్పందించారు. భోజనాలకు ఉపయోగించే ప్లేట్లను మురికి నీటిలో కడుగుతున్నారనేది అవాస్తవమని తెలిపారు. భోజనం చేసిన తర్వాత వాష్బేసిన్లో పెట్టిన ప్లేట్లను బయటకు తీస్తున్న సమయంలో కొంతమంది వీడియో తీసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని వివరించారు.