హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎమ్మెల్సీ రఘురాజుపై ఏపీ శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. రఘురాజు అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజీనామాచేసి టీడీపీలో చేరారు.
దీంతో రఘురాజుపై పార్టీ ఫిరాయింపుల చట్టం కింద చర్యలు తీసుకోవాలని వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ రఘురాజును వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు ఇచ్చిన చైర్మన్ వద్దకు వెళ్లకపోవడంతో అనర్హత వేటువేసింది.