హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మంత్రులకు శాఖలను కేటాయించింది. హోంశాఖ పదవి మరోసారి మహిళనే వరించింది. అది కూడా దళిత మహిళ. తొలుత మంత్రి వర్గంలోనూ ఎస్సీ మహిళకే హోం శాఖను కట్టబెట్టిన సీఎం జగన్.. అదే సంప్రదాయాన్ని మరోసారి కొనసాగించారు.
2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హోంశాఖ బాధ్యతలను మేకతోటి సుచరితకు అప్పగించిన విషయం తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు నియోజకవర్గం నుంచి గెలుపొందిన తానేటి వనిత (ఎస్సీ)కు హోంశాఖను కేటాయించారు. గత కేబినెట్లో మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా వనిత కొనసాగిన సంగతి తెలిసిందే. ఆర్కే రోజాకు హోంశాఖ కేటాయిస్తారని ప్రచారం జరిగినప్పటికీ ఆ వార్త అవాస్తవమని తేలిపోయింది.