AP News | పీపీపీ విధానంలోకి మెడికల్ కాలేజీలు.. కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు
AP News |మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది.
AP News |మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది. అది చట్టవిరుద్ధం అయితే తప్ప అందులో కోర్టులు జోక్యం చేసుకోవడం కుదరదని స్పష్టం చేసింది. టెండర్ ప్రక్రియను అడ్డుకుంటూ ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది.
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తూ ఇచ్చిన జీవో 590ని సవాలు చేస్తూ తాడేపల్లికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కొర్రా వసుంధర హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫున హైకోర్టులో సీనియర్ న్యాయవాది శ్రీరాం, మరో న్యాయవాది అశోక్ రాం వాదనలు వినిపించారు. టెండర్లు ఖరారు చేయకుండా స్టే ఇవ్వాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అయితే ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం.. పిటిషనర్ అభ్యర్థనను తిరస్కరించింది.
మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని హైకోర్టు తెలిపింది. కాబట్టి థర్డ్ పార్టీకి హక్కులు కల్పించకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. కాకపోతే ఆస్పత్రులను పీపీపీ విధానంలో చేపట్టాలని తీసుకున్న నిర్ణయంలో ఉన్న లాభ, నష్టాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

