తిరుమల : ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు ఈ రోజు తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే వెంకట గౌడ్ తదితరులు వీఐపీ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు శ్రీవారి సన్నిధిలో ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.