అమరావతి: ఏపీలో రివర్స్ పీఆర్సీకి వ్యతిరేకంగా ఫిబ్రవరి 6 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల సమ్మెకు వైద్యార్యోగ శాఖ సంఘాలు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించాయి . ఉద్యోగుల సమ్మెలో భాగంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈరోజు అమరావతిలో వైద్యార్యోగ శాఖ సంఘాల జేఏసీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఉద్యోగుల సమ్మె, వైద్యార్యోగశాఖలో పనిచేస్తున్న ఔట్సోర్స్, కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని సమ్మెకు మద్దతును ఇవ్వాలని నిర్ణయించాయి. అనంతరం జేఏసీ సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడారు.
రెండున్నర ఏండ్లుగా ఫ్రంట్లైన్ వర్కర్లుగా పనిచేస్తున్నా తమతకు సెలవులు ఇవ్వకుండా దుర్మారంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైద్యారోగ్య శాఖ పర్యవేక్షణను జేసీలకు అప్పగించొద్దన్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. మరోవైపు విద్యుత్ శాఖ ఉద్యోగులు కూడా సమ్మెకు మద్దతిస్తామని ప్రకటించాయి.