అమరావతి: సీనియర్ పోలీస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావుకు (AB Venkateswara Rao) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా ఆయనను ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల మేరకు శుక్రవారం ఉదయం వెంకటేశ్వర రావుపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా పోస్టింగ్ ఇచ్చింది. దీంతో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. అయితే శుక్రవారం సాయంత్రమే ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
ఐదేండ్ల క్రితం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై సస్పెన్షన్ వేటువేసింది. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించడంతో సస్పెన్షన్ ఎత్తి వేయాలని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై జగన్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే క్యాట్ ఉత్తర్వులపై జోక్యం చేసుకోబోమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అప్పటి నుంచి ఏ పోస్టింగ్ లేకుండా ఆయన కొనసాగుతున్నారు. తాజాగా నేటితో సర్వీస్ ముగుస్తుండటంతో ప్రభుత్వం ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది.