అమరావతి : సింగపూర్లో ఇవాళ జరిగిన ఓపెన్ బ్యాడ్మింటన్ ఫైనల్ పోటీలో విజేతగా నిలిచిన పీవీ సింధుకు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. పీవీ సింధు విజయం దేశానికి గర్వకారణమని వారు పేర్కొన్నారు. ఈ ఏడాది మూడో టైటిల్ను సొంతం చేసుకోవడం అభినందనీయమని వారు అన్నారు.
సింధు తన అప్రతిహతంగా విజయయాత్రను కొనసాగిస్తున్నారని ఏపీ గవర్నర్ తెలిపారు. అందరి ప్రశంసలకు పీవీ సింధు అర్హురాలని అన్నారు. భవిష్యత్తులో మరెన్నో గుర్తింపులు తీసుకురావాలని ఆకాంక్షించారు.