Bhumana Karunakar Reddy | టీటీడీ వ్యవహారంలో భూమన అరెస్టుకు రంగం సిద్ధం!
Bhumana Karunakar Reddy | టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని అక్రమ కేసులతో అరెస్టు చేయాలని చూస్తున్నారని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ వెల్లడించారు.
Bhumana Karunakar Reddy | టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిని అక్రమ కేసులతో అరెస్టు చేయాలని చూస్తున్నారని తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త భూమన అభినయ్ వెల్లడించారు. కొంతకాలంగా టీటీడీ పాలక మండలికి, కూటమి ప్రభుత్వానికి కంటగింపుగా మారిన భూమన కరుణాకర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని అన్నారు. భూమన అక్రమ అరెస్టుతో వైసీపీ నోళ్లు మూయించలేరని స్పష్టం చేశారు.
టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో అవినీతి జరిగిందని, కొంత మంది కాంట్రాక్టర్లతో అనుకూలంగా స్టేట్మెంట్లు ఇప్పించుకున్న విజిలెన్స్ అధికారులు మా నాయకుడు కరుణాకర్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడానికి సిద్ధమైనట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని అభినయ్ తెలిపారు. ఇలాంటి అక్రమ కేసులు, అరెస్ట్‌లు, జైళ్లతో ఉద్యమాలకు మారుపేరైన కరుణాకర్ రెడ్డి, అలాగే తిరుపతి నియోజకవర్గ, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తల నోళ్లు మూయించాలని అనుకోవడం అవివేకమని వ్యాఖ్యానించారు. ఇలాంటి వాటికి భయపడే నైజం భూమన కరుణాకర్రెడ్డిది కానేకాదని స్పష్టం చేశారు. కూటమి పాలకుల ఒత్తిళ్లకు తలొగ్గి, కట్టుకథలతో, అక్రమ కేసుతో మా నాయకుడి అరెస్ట్‌కు సిద్ధమైన టీటీడీ విజిలెన్స్ …మా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని తెలిపారు.
అరెస్టు చేస్తే జైలు నుంచి ఇంతకు వందింతలు శక్తితో మా నాయకుడు కరుణాకర్ రెడ్డి తిరిగి వస్తారని భూమన అభినయ్ తెలిపారు. అప్పుడు మరింత బలంగా, శక్తిమంతంగా టీటీడీలో ప్రస్తుత పాలకులు చేస్తున్న తప్పుల్ని, కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాల్ని కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో తిప్పి కొడతామని హెచ్చరించారు. దేశంలో ఎమెర్జెన్సీని వ్యతిరేకిస్తూ అత్యంత చిన్న వయసులోనే జైలును ముద్దాడిన పోరాట పటిమ, స్ఫూర్తి భూమన కరుణాకరరెడ్డిది అని కొనియాడారు. అలాంటి నాయకుడిపై టీటీడీ ఇంజనీరింగ్ పనుల్లో అక్రమాల సాకుతో అరెస్ట్ చేయాలని అనుకోవడం, అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని అడ్డుకోవడం లాంటిదేనని తెలిపారు. ఇలాంటి వాటికి భూమన, వైసీపీ అభిమానులెవరూ భయపడకపోగా, మరింత శక్తిని కూడగట్టుకుని ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతారని హెచ్చరించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

