AP News | స్త్రీ శక్తి పథకానికి ఏపీ ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. రూ400 కోట్ల అదనపు నిధులు విడుదల చేసింది. ఈ మేరకు రవాణా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
సూపర్ సిక్స్‌లో భాగంగా ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించే ఈ పథకాన్ని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రారంభించింది. ఆగస్టు 15వ తేదీ నుంచి ఇప్పటివరకు దాదాపు మూడు నెలల పాటు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించిన బకాయిలను చెల్లించలేదు. తాజాగా రెండున్నర నెలల్లో జారీ చేసిన జీరో ఫేర్ టికెట్ల ఖర్చుకు సంబంధించిన 400 కోట్లను విడుదల చేసింది. దీనిపై తదుపరి చర్యలు తీసుకోవాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.