TDP | బుడమేరు వరదలు రావడం ఏమో గానీ.. చంద్రబాబు బ్యాచ్ వందల కోట్లు వెనకేసుకుందని వైసీపీ నాయకులు చేస్తున్న విమర్శలపై టీడీపీ ఘాటుగా స్పందించింది. కొవ్వొత్తులకే రూ.23 కోట్లు ఖర్చు పెట్టారని వైసీపీ నాయకులు చెప్పడంపై మండిపడింది. గత మూడు రోజుల నుంచి ఈ వార్తను వైసీపీ ఫేక్ ముఠా సోషల్‌మీడియాలో తిప్పుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. సైకోగాళ్లు ఫేక్ ప్రచారం చేస్తున్నారని మండిపడింది.
వరద బాధితులకు అందించిన కొవ్వొత్తులకే రూ.23 కోట్లు ఖర్చు పెట్టారనే ఆరోపణలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చిందని టీడీపీ తెలిపింది. అది కేవలం కొవ్వొత్తుల కోసం పెట్టిన ఖర్చు కాదని.. మొబైల్ జనరేటర్ల కోసం పెట్టిన ఖర్చు అని ప్రభుత్వ రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా చెప్పారని పేర్కొంది. ఇప్పుడు ఏదో కొత్తగా కనిపెట్టినట్లుగా మాట్లాడుతున్నారని చెప్పింది. ఎగ్గు పఫ్పులు మెక్కి, బాగా కొవ్వు పట్టి, ఇప్పుడే నిద్ర లేచాడు ఈ వైసీపీ కొత్త పిచ్చోడు అని తీవ్రంగా విమర్శించారు.
పుంగనూరు వెళ్లి కల్తీ రాజకీయం చేద్దామని అనుకున్నాడని.. కానీ అక్కడ ఛీకొట్టడంతో కొత్త ఫేక్ మొదలుపెట్టాడని టీడీపీ మండిపడింది. కల్తీ బతుకులకు అలవాటు పడ్డ ప్రాణం.. ఈ సిగ్గు లేని సైకో జగన్‌ది అని విమర్శించింది. ఈ సైకో జగన్ ఫేక్ రాజకీయాలపై ప్రజలు థూ అని ఊసినా.. సిగ్గు లేని బతుకులు తుడుచుకుని మళ్లీ మొదలుపెడతాని తెలిపింది. అందుకే మనిషికో మాట.. గొడ్డుకో దెబ్బ అని పెద్దలు అన్నారని చెప్పింది.