విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో (Skill development case) అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని (Chandrababu Naidu) పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సిట్ కార్యాలయం నుంచి కోర్టుకు తీసుకొచ్చిన సీఐడీ (CID) అధికారులు.. ఇప్పటికే రిమాండ్ రిపోర్టును న్యాయస్థానానికి సమర్పించారు. ఇరుపక్షాల వాదనలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా టీమ్, సీఐడీ తరఫున ఏఏజీ పీ.సుధాకర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే విషయమై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. బాబును జ్యూడిషియల్ కస్టడీకి అప్పగిస్తారా లేదా బెయిల్ ఇస్తారా అనేది మరికాసేపట్లో తేలనుంది.