గురువారం 03 డిసెంబర్ 2020
Andhrapradesh-news - Aug 21, 2020 , 13:08:15

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ దేవాదాయశాఖ మంత్రి

  శ్రీవారిని దర్శించుకున్న ఏపీ దేవాదాయశాఖ మంత్రి

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున అభిషేకం సేవలో ఆయన కుటుంబం సమేతంగా పాల్గొన్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విగ్రహాలు వీధుల్లో పెట్టరాదనే నిర్ణయానికి ముందు అన్ని పార్టీలు, మఠాధిపతులు, పీఠాధిపతులతో మాట్లాడామన్నారు. రఘురామ కృష్ణంరాజు గత ఐదు నెలలుగా ఇంత వరకు ఆయన నియోజకవర్గానికి రాలేదు.

నియోజకవర్గం పై అంత ప్రేమ ఉంటే ఎందుకు అక్కడ చవితి వేడుకల్లో పాల్గొనలేదని’’ మంత్రి వెల్లంపల్లి ప్రశ్నించారు. నీచ రాజకీయాలు చేస్తూ.. చంద్రబాబు డైరెక్షన్ లో పని చేస్తున్నారని రఘురామ కృష్ణంరాజును ఘాటుగా ఆయన  విమర్శించారు.శ్రీవారి ఆశీస్సులు సీఎం వైఎస్‌ జగన్‌, రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకున్నానని తెలిపారు. కరోనా దృష్ట్యా‍ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పండుగలు ఇంటికే పరిమితం కావాలని సూచించాయని ఆయన పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.