AP DSC 2024 | టీచర్ పోస్టులకు సిద్ధమవుతున్న వారికి షాక్.. మెగా డీఎస్సీ వాయిదా
AP DSC 2024 | ఏపీలో మెగా డీఎస్సీ 2024 వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల డీఎస్సీ ప్రకటనను వాయిదా వేశారు. రెండు రోజుల కిందట ఏపీలో టెట్ ఫలితాలను వెల్లడించారు.
AP DSC 2024 | ఏపీలో మెగా డీఎస్సీ 2024 వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల డీఎస్సీ ప్రకటనను వాయిదా వేశారు. రెండు రోజుల కిందట ఏపీలో టెట్ ఫలితాలను వెల్లడించారు. దీంతో వెంటనే మెగా డీఎస్సీని విడుదల చేస్తారని అంతా ఆశించారు. కానీ ఇప్పుడు డీఎస్సీని తాత్కాలికంగా వాయిదా వేశారు. రెండు రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.
మెగా డీఎస్సీ వాయిదా పడటానికి ఎస్సీ రిజర్వేషన్లే కారణమని తెలుస్తోంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేసే వరకు ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయకూడదని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తున్నది. ఎస్సీ రిజర్వేషన్లతో ఎస్సీలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఆక్షేపిస్తున్నది. ఈ క్రమంలోనే మంగళవారం నాడు ఏపీ సీఎం చంద్రబాబుతో మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రిజర్వేషన్ల అమలుకు సంబంధించి పలు అంశాలను చర్చించారు. అయితే డీఎస్సీ నియామకాల్లో ఎస్సీ రిజర్వేషన్ల అంశం కొలిక్కిరాకపోవడం, దీనిపై సీఎం నిర్ణయం తీసుకోవాల్సి ఉండటంతో డీఎస్సీ నోటిఫికేషన్ ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. ఇందులో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు,, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు ఉండనున్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి. కాగా, డీఎస్సీని ఆన్లైన్లో నిర్వహిస్తుండటంతో అనేక విడతల్లో పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎస్జీటీ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహణకు వారం రోజుల సమయం పడుతోంది. దీంతో పరీక్షల ఫలితాలను నార్మలైజేషన్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సమస్య లేకుండా ఉండేందుకు రెండు, మూడు జిల్లాలకు ఒకేసారి పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని విద్యా శాఖ యోచిస్తోంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP DSC
- AP DSC 2024
- AP News
- AP TET
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

