AP DSC 2024 | రేపే మెగా డీఎస్సీ .. మూడు జిల్లాలకు ఒకేసారి పరీక్ష పెట్టే ప్లాన్!
AP DSC 2024 | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను సోమవారం విడుదల చేసిన విద్యాశాఖ ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటనకు సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన (రేపు) మెగా డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. దరఖాస్తుల ప్రక్రియ కూడా రేపటి నుంచే ప్రారంభమవుతుంది.
AP DSC 2024 | ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలను సోమవారం విడుదల చేసిన విద్యాశాఖ ఇప్పుడు మెగా డీఎస్సీ ప్రకటనకు సిద్ధమైంది. ఈ నెల 6వ తేదీన (రేపు) మెగా డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. దరఖాస్తుల ప్రక్రియ కూడా రేపటి నుంచే ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు అంటే.. డిసెంబర్ 6వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణకు సమయం ఇచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు.
మొత్తం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటన విడుదల కానుంది. ఇందులో ఎస్జీటీ 6371 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లు 7725 పోస్టులు, టీజీటీ 1781 పోస్టులు, పీజీటీ 286 పోస్టులు,, ప్రిన్సిపల్ 52 పోస్టులు, పీఈటీ 132 పోస్టులు ఉండనున్నాయి. ఎస్జీటీ పోస్టులు అత్యధికంగా కర్నూలు జిల్లాలో ఉన్నాయి.
కాగా, డీఎస్సీని ఆన్లైన్లో నిర్వహిస్తుండటంతో అనేక విడతల్లో పరీక్ష నిర్వహించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎస్జీటీ పోస్టులకు సంబంధించిన పరీక్ష నిర్వహణకు వారం రోజుల సమయం పడుతోంది. దీంతో పరీక్షల ఫలితాలను నార్మలైజేషన్ చేసి విడుదల చేస్తున్నారు. ఈ సమస్య లేకుండా ఉండేందుకు రెండు, మూడు జిల్లాలకు ఒకేసారి పరీక్ష నిర్వహిస్తే ఎలా ఉంటుందని విద్యా శాఖ యోచిస్తోంది.
ఏపీలో టెట్ ఫలితాలు నిన్ననే విడుదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా టెట్ కోసం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. 3,68,661 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1,87,256(50.79 శాతం) మంది అర్హత సాధించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP DSC
- AP DSC 2024
- AP News
- AP TET
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

