తిరుమల : ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు (DGP Dwaraka Tirumalrao) దంపతులు తిరుమలలో (Tirumala) వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం బ్రేక్దర్శన్లో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు డీజీపీకి ఘన స్వాగతం పలికారు.
దర్శనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అడిషనల్ ఈవో వెంకయ్యచౌదరి డీజీపీ దంపతులకు శ్రీవారి ప్రసాదాన్ని, తీర్థ ప్రసాదాలను, స్వామివారి ఫొటోను అందజేశారు. డీజీపీ వెంట ఎస్పీ సుబ్బారాయుడు, సీవీఎస్వో శ్రీధర్, డిప్యూటీ ఈవో లోకనాథం తదితరులు ఉన్నారు.
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామివారి దర్శనానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయి ఎంపీసీ వరకు క్యూలైన్లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 20 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan) అవుతుందని అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 78,414 మంది దర్శించుకోగా 26,100 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ. 3.45 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు.