YS Sharmila | ప్రభాస్‌తో రిలేషన్‌పై గతంలో వచ్చిన పుకార్లపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ప్రభాస్ ఎవరో ఇప్పటికీ తనకు తెలియదని ఆమె స్పష్టం చేశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ప్రభాస్‌తో తనకు సంబంధం ఉన్నట్లు ప్రచారం చేయించారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో శుక్రవారం షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై ధ్వజమెత్తారు.
తన మీద బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయించారని జగన్ ఒక్క ఎంటర్టైన్మెంట్ వీడియో చూపించారని వైఎస్ జగన్ అన్నారు. మీకు నిజంగానే చెల్లెలిపై ప్రేమ ఉంటే, బాలకృష్ణ నివాసంలోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పుడు ప్రచారం జరిగిందని నమ్మితే.. గత ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి మీరేం గాడిదలు కాశారని మండిపడ్డారు. బాలకృష్ణ మీద ఎందుకు విచారణ జరిపించలేదని నిలదీశారు. ప్రభాస్‌తో తనకు సంబంధం ఉందని వైసీపీ సోషల్‌మీడియా ప్రచారం చేయలేదా అని ప్రశ్నించారు.
ప్రభాస్ ఎవడో నాకు తెల్వదు..
నేను ప్రభాస్‌ను ఇంతవరకు చూడలేదు.. నా బిడ్డల మీద ప్రమాణం వేసి చెప్తున్న ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు – వైయస్ షర్మిల pic.twitter.com/n8i9S8ZAfo
— Telugu Scribe (@TeluguScribe) November 22, 2024
‘ నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా, ప్రభాస్ ఎవరో నాకు తెలియదు. ఆయన్ను ఎప్పుడూ చూడలేదు.’ అని షర్మిల స్పష్టం చేశారు. జగన్ ఈ ప్రాపగండా చేయించారని, నా వీడియో చూపించి జగన్ సానుభూతి పొందాలని చూశారని మండిపడ్డారు. ‘ జగన్ ఆయన స్వార్థం కోసం అమ్మపై కేసు పెడతారు, నాన్న పేరు సీబీఐ చార్జిషీట్లో పెడతారు, నాపై దుష్ప్రచారం చేయిస్తారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను జగన్మోహన్ రెడ్డిని ఎత్తిచూపకపోతే నా ఆస్తి, నాకు ఇస్తానని అంటున్నారని తెలిపారు. కానీ నేను మాట్లాడకుండా ఉండలేనని.. కాంగ్రెస్ పార్టీ చీఫ్‌గా ఉండి ఇలాంటివి నేను మాట్లాడకుంటే ఎలా అని ప్రశ్నించారు.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ రూ.1750 కోట్లు లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో వెల్లడవ్వడంపైనా షర్మిల మండిపడ్డారు. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని విమర్శించారు. ప్రధాని మోదీకి జగన్ దత్తపుత్రుడు అని అన్నారు. ఆయన మీద విచారణ చేయిస్తారా అని ప్రశ్నించారు. అదానీపై జేఏసీ వేయాలని డిమాండ్ చేశారు.