అమరావతి : గుంటూరు జిల్లా ఆత్మకొండూరు మండలం కొలనుకొండలో ఇస్కాన్ ఆధ్వర్యంలో అక్షయ ఫౌండేషన్ నిర్మించిన కేంద్రీకృత వంటశాలను ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. అత్యాధునికంగా నిర్మించిన వంటశాల రెండు గంటల్లోనే 50 వేల మందికి ఆహారం సిద్ధం చేస్తుంది. జగనన్న గోరుముద్ద పథకానికి అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆహారాన్ని సరఫరా చేస్తుంది.
మధ్యాహాభోజన వంటశాల, సరఫరా చేసే వాహనాలను ఈ సందర్భంగా సీఎం ప్రారంభించారు. విద్యార్థులకు స్వయంగా భోజనాన్ని వడ్డించారు. అనంతరం రూ. 70 కోట్లతో ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న గోకుల క్షేత్రానికి భూమిపూజ చేశారు. గోకులక్షేత్రంలో రాధాకృష్ణుడు, వేంకటేశ్వర స్వామి ఆలయాలు, యోగ, ధ్యాన కేంద్రాలతో పాటు కళాక్షేత్రాలను ఇస్కాన్ నిర్మిస్తుంది.