అమరావతి : అమెరికాలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒలింపిక్ చాంపియన్, భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సిల్వర్ మెడల్ సాధించడం పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్ ట్విటర్ వేదిక ద్వారా అభినందనలు తెలిపారు. చాంపియన్ నీరజ్ చోప్రా మరోసారి భారతదేశ కీర్తిని ఇనమడింప చేశాడని ప్రశంసించారు. జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకున్నాడు.
దీంతో ప్రపంచ అథ్లెటిక్స్‌లో రజతం సాధించిన తొలి భారత ఆటగాడిగా చోప్రా రికార్డు సృష్టించాడు. తొలి ప్రయత్నంలో విఫలమైన 24 ఏండ్ల చోప్రా తన నాలుగో ప్రయత్నంలో 88.13 మీటర్ల దూరం బల్లెం విసిరి రెండో స్థానంలో నిలిచాడు.