అమరావతి : ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు (Chandra Babu) తొలిసారిగా విజయవాడలోని ఇంద్రకీలాద్రి(IndraKeeladri) అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం తిరుమల (Tirumala) లో వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం మధ్యాహ్నాం ఇంద్రకీలాద్రిని సతీమణి భువనేశ్వరి, కుమారుడు, మంత్రి నారా లోకేష్(Nara Lokesh) , సతీమణి బ్రాహ్మణి, మనువడు దేవాన్సు దర్శించుకున్నారు.
అనంతరం తిరుచనూరులోని పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సీఎంగా విజయవాడకు వచ్చిన సందర్భంగా తొలిసారి గన్నవరం ఎయిర్పోర్టులో టీడీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు , దేవదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఆలయ ఈవో తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు చంద్రబాబు కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి శాలువాలతో సత్కరించారు.