అమరావతి : నరసాపురం మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో నిర్బంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ సీఐడీ(AP CID) మాజీ అదనపు ఎస్పీ విజయ్‌పాల్‌కు (Vijaypal) గుంటూరు కోర్టు (Guntur Court ) 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అనంతరం ఆయనను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
నిన్న ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన విజయ్‌పాల్‌ను పోలీసులు సుదీర్ఘంగా విచారించి రాత్రి అరెస్టు(Arrest) చేశారు. బుధవారం ఆరోగ్య పరీక్షల అనంతరం గుంటూరు కోర్టుకు తరలించగా కోర్టు రిమాండ్ విధించింది. ఈ సందర్భంగా పోలీసులు ఆయనపై 11 పేజీల రిమాండ్ రిపోర్టును కోర్టు ముందుంచారు. ఆయనను రెండువారాల రిమాండ్‌కు ఇవ్వాలని కోరారు.
వాస్తవాలు రాబట్టేందుకు విజయ్‌పాల్‌ను కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. రఘురామను చిత్రహింసల కేసులో విజయ్‌పాల్ పాత్ర కీలకమని వెల్లడించారు. చిత్రహింసల వెనుక ఉన్న సూత్రధారులను కనుగొనాల్సి ఉన్నందున ఇంటరాగేషన్‌కు అనుమతి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు.