అమరావతి : ఏపీ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలిగా(AP BJP Chief) దగ్గుబాటి పురందేశ్వరి(Purandeshwari ) నియమితులయ్యారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల అధ్యక్షులను మారుస్తూ మంగళవారం బీజేపీ అధిష్టానం నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు(Somu Verraju)ను తప్పిస్తూ కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరిని నియమించింది.
యూపీఏ(UPA) హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆమె 2014లో కాంగ్రెస్(Congress)కు రాజీనామా చేసి 2014లో బీజేపీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో వివిధ పదవులను నిర్వహిస్తూ వస్తున్నారు. ఒడిశా బీజేపీ ఇన్చార్జిగా, మహిళా మోర్చా ప్రధాన ప్రభారి బాధ్యతలను ఆమె నిర్వహించారు. సోము వీర్రాజు 2020 జులై 27 నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు మంగళవారం జాతీయ అధ్యక్షుడు నడ్డా సోము వీర్రాజుకు ఫోన్ చేసి అధ్యక్ష పదవిని మారుస్తున్నట్లు సమాచారం అందజేశారు.