అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ( Andhra Pradesh) అన్నమయ్య జిల్లాలో ఈతకెళ్లి ఐదుగురు బాలురు మృతి చెందిన విషాద ఘటన మరువక ముందే ఏలూరు ( Eluru ) జిల్లాలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని భీమడోలు మండలం కోమటిగుంట చెరువులో మునిగి ముగ్గురు మృతి చెందారు.
పెదలింగంపాడులో వేడుకకు హాజరైన నలుగురు తిరుగు ప్రయాణంలో కాలకృత్యాల కోసం కోమటిగుంట చెరువు వద్ద ఆగారు. ముగ్గురు చెరువులో దిగగా ప్రమాదవశాత్తు చెరువులో పడి పెదవేగి మండలం వేగివాడ గ్రామానికి చెందిన అజయ్, అభిలాష్, సాగర్ అనే యువకులు మృతి చెందారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో గాలింపు చర్యలు మొదలుపెట్టి మృతదేహాలను బయటకు తీయించి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.