తిరుపతి : తిరుపతిలోని ( Tirupati ) శ్రీ కోదండరామ స్వామి ఆలయానికి శుక్రవారం కియోస్క్ యంత్రాన్ని ( Kiosk machine ) సౌత్ ఇండియన్ బ్యాంక్ ( South Indian Bank) విరాళంగా అందించింది. క్యూ ఆర్ కోడ్ యంత్రంతో యూపీఐ మోడ్ లో రూ. లక్ష వరకు భక్తులు విరాళంగా అందజేయవచ్చు. ఇప్పటికే సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఒక కియోస్క్ మిషన్ అందించగా తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాదాలు భవనంలో అందుబాటులో ఉంచారు.
ఈరోజు ఇచ్చిన మిషన్ను తిరుపతి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉపయోగంలోకి రానుంది. కియోస్క్ మిషన్ లను తిరుమల అన్నదానం, పద్మావతీ గెస్ట్ హౌస్, సీఆర్వో ఆఫీస్ , దేవుని కడప, తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, అమరావతి, ఒంటిమిట్ట, పద్మావతీ అమ్మవారి ఆలయం, వకుళామాత ఆలయం, కపిలతీర్థం ఆలయం, హైదరాబాద్, చెన్నై , బెంగళూరు, విజయవాడ లలో టీటీడీ వినియోగిస్తోంది. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియన్ బ్యాంక్ ప్రతినిధులు ఏ.వి.నిరంజన్, ఆర్.వెంకటరావు, డి.అశోక్ వర్థన్, ఆలయ డిప్యూటీ ఈవో బి నాగరత్న, ఐటీ డిజీఎం బి వేంకటేశ్వర్లు, ఏఈవో బి రవి, సూపరింటెండెంట్ డి ముని శంకర్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు రూ.17 లక్షలు విరాళం
తిరుమల : హైదరాబాద్ కు ( Hyderabad ) చెందిన పవర్ మెక్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎండీ సత్య రోహిత్ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు శుక్రవారం రూ.17 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు. ఈ విరాళాన్ని భక్తులకు మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో ఒక పూట మధ్యాహ్నం భోజనం వడ్డించేందుకు ఉపయోగించాలని దాత కోరారు.