అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వం ( Coalition Government ) అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపక్ష నాయకులపై వరుసుగా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పటికే మద్యం, ఇసుక, బెదిరింపులు, దాడుల పేరిట వైసీపీకి చెందిన కీలక నాయకులను అరెస్టు చేసి జైలులో పెట్టిన విషయం తెలిసిందే. వైసీపీకి కీలక నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని ( Kodali Nani ) పై తాజాగా ఏపీ పోలీసులు మరో కేసును నమోదు చేశారు.
ఈ కేసుకు సంబంధించిన 41 సీఆర్పీసీ నోటీసులను గుడివాడలోని కొడాని నాని ఇంటికి వెళ్లి ఆదివారం అందజేశారు. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబాన్ని కించపరిచేలా నాని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 2024లో విశాఖ వాసి అంజనాప్రియ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదును ఆదారంగా చేసుకుని విశాఖ మూడో టౌన్ పోలీసులు 353(2), 352, 351(4) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.