హైదరాబాద్, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లోని అన్నవరం సత్యనారాయణస్వామి దేవస్థానం ఆన్లైన్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. www.aptemples.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ సేవలు పొందవచ్చని అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. స్వామివారి పూజ, దర్శనం, ప్రసాదం, కల్యాణకట్ట, అన్నదానం టికెట్లు, వసతి గదులు, కల్యాణ మండపాలను ముందస్తుగా బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.