అమరావతి : ఏపీలో దారుణం చోటు చేసుకుంది. ఓ టమాట రైతును దుండగులు కిరాతకంగా హత్య(murder) చేశారు. చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన టమాట రైతు (Tomota Farmer ) రాజారెడ్డిని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించి హత్య చేశారు. వ్యవసాయంతో పాటు పాడి పశువులపై ఆదారపడ్డ రైతు రాజారెడ్డి మంగళవారం రాత్రి 20 లీటర్ల పాలను పక్కనున్న గ్రామంలో పోసి బైక్పై తిరిగి పయనమయ్యాడు. మార్గమధ్యలో దుండగులు బైక్ను ఆపి అతడి నోట్లో గుడ్డలు కుక్కి, చేతులు, కాళ్లు కట్టేసి హత్యచేసి పారిపోయారు.
రాజారెడ్డికి గ్రామంలో ఉన్న 20 ఎకరాల పొలంలో నాలుగు ఎకరాల్లో టమాటను పండిస్తున్నాడు. ఇటీవల టమాట ధర విఫరీతంగా పెరిగిపోవడంతో టమాట అధిక ధరకు పలుకుతుంది. ఈ నేపధ్యంలో రాజారెడ్డి తన పొలంలో పండిన పంటను ప్రతిరోజు మదనపల్లి మార్కెట్కు తరలించి విక్రయించి వస్తున్నాడు. టమాట విక్రయం వల్ల అధిక డబ్బు వస్తుండడంతో అతడిని దారికాచి హత్యచేసి ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రాజారెడ్డి హత్యను అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని మదనపల్లి డీఎస్పీ కేశవ్ తెలిపారు. మృతుడి వద్ద విక్రయించిన టమాట బిల్లులు కూడా ఉన్నాయని వివరించారు. హత్య జరిగిన స్థలంలో సెల్ టవర్సిగ్నల్స్ ఆధారంగా కూడా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తామని ఆయన వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.