అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం షాకిచ్చింది. గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ (GPS) చట్టాన్ని అమలు చేస్తున్నట్లు గెజిట్ నోఫికేషన్ విడుదల చేసింది. గతేడాది అక్టోబర్ 20 నుంచి జీపీఎస్ అమలులోకి వస్తుందని అందులో పేర్కొంది. గెజిట్‌లో జీవో నంబర్ 54ను జూన్ 12వ తేదీనే విడుదల చేసినట్లు తెలిపింది. అదే రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీపీఎస్, జీపీఎస్‌ను సమీక్షంచి ఆమోదయోగ్యమైన పరిష్కారం చేస్తామని మ్యానిఫెస్టోలో పేర్కొన్న చంద్రబాబు, అధికార బాధ్యలు చేపట్టిన నెలకే గెజిట్ విడుదల చేయడమేంటనీ ప్రశ్నిస్తున్నాయి.
కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS)లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఆంధ్రప్రదేశ్ గ్యారెంటీ పెన్షన్ సిస్టమ్ (APGPS) లోకి తీసుకొస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం రాత్రి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. జీపీఎస్ చట్టం-2023లోని చాప్టర్ 1లోని సెక్షన్ 1, సబ్ సెక్షన్ (3) ప్రకారం దీనిని విడుదల చేసినట్లు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ పేరు మీదుగా గెజిట్ విడుదల అయింది.
అయితే ఈ గెజిట్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ ప్రభుత్వం అంటున్నది. జీపీఎస్‌కు సంబంధించిన ఫైల్‌పై జూన్ 12న అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ సంతకం చేశారని, పాత ప్రభుత్వంలోనే దీనిని రూపొందించారని వెల్లడించింది. ఈ నిర్ణయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని టీడీపీ నేతలు అంటున్నారు.
రద్దు చేయాల్సిందే..
జీపీఎస్ అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ దుర్మార్గమని, వెంటనే రద్దు చేయాలని యూటీఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. ఇదొక దుర్మార్గమైన చర్యఅని ఆగ్రహం వ్యక్తంచేశారు. పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించడమే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్ష అని తెలిపారు.